Wednesday 9 June 2021

సేవే అతడి పిచ్చైతే.. అది వర్ధిల్లాలి !

సేవే అతడి పిచ్చైతే.. అది వర్ధిల్లాలి !: రమణ కొంటికర్ల………………………………………………………… రేణికుంట రమేష్ పోస్టింగ్స్ ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారని బల్ల గుద్ది మరీ స్పష్టంగా చెప్పలేం కానీ… వేలల్లో నెటిజనం మాత్రం చూస్తున్నారు. ఆయన హృదయం విదారకరమైనప్పుడు స్పందించే తీరుకు… ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులతో నెటిజనం నుంచీ అంతే స్పందనా, అదే ప్రతిస్పందనా మాత్రం వస్తోంది. సేవకు సోషల్ మీడియా కూడా ఓ మార్గమని పట్టిచూపించిన బహు కొద్దిమందిలో రమేషొకడనుకుంటా! అందుకే రమేష్ బాయ్ ఫ్రెండ్ గా నేనతడి కోసం రాస్తున్న ప్రేమలేఖ ఇది!! రమేష్ ఎర్రితనం వర్ధిల్లాలి… రేణికుంట రమేష్ సోషల్ సర్వీసూ వర్ధిల్లాల్లి… రమేష్ పిచ్చి మరింతమందికి పిచ్చి పట్టించే స్ఫూర్తవ్వాలి! రమేషెక్కడో పక్క రాష్ట్రంలోనో… లేక, ఫ్రాన్స్ లోనో పుట్టిన ప్రత్యే’కథేం’ కాదు. జస్ట్ పల్లెటూరి పిల్లగాడు. మండల కేంద్రానికి పక్కనే ఉన్నా… కనీసం రోడ్డు లేని రోజుల్లో… సైకిల్ మీద చదువుకోసం, తనకిష్టమైన క్రికెటాట కోసం ఉరుక్కుంటూ… తన పల్లెటూరైన దమ్మనపేట